TS : బండి సంజయ్ పై పీడీ చట్టం ప్రయోగించాలి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

TS : బండి సంజయ్ పై పీడీ చట్టం ప్రయోగించాలి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. బండి సంజయ్‌ని జైలు నుంచి విడుదల చేయకూడదంటూ పోస్ట్ చేశారు

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. ఆయనను పీడీ చట్టం కింద నిర్బంధించాలని ట్వీట్‌ చేశారు. పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు.అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. బండి సంజయ్‌ని జైలు నుంచి విడుదల చేయకూడదంటూ పోస్ట్ చేశారు. ఈ కుట్రతో పాటు పాత కేసులను విచారించి సంజయ్‌కు కఠినంగా శిక్షించాలన్నారు. వరంగల్‌ సీపీ అద్భుతంగా విచారణ చేశారంటూ కితాబు ఇచ్చిన ఆయన నిజాయతీ లేని, అవినీతి రాజకీయ నాయకుల నుంచి తెలంగాణను కాపాడాలని నేను కోరుతున్నాను’ అంటూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story