TS : సైబర్ క్రైమ్ పట్ల అవగాహన రావాలి : సీవీ ఆనంద్

TS : సైబర్ క్రైమ్ పట్ల అవగాహన రావాలి : సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో వార్షిక సైబర్‌ సెక్యూరిటీ నాలెడ్జ్‌ సమ్మిట్‌-2023 నిర్వహిస్తున్నారు

ప్రజల్లో సైబర్ క్రైమ్‌పై అవగాహనతో పాటు.. చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్. హైదరాబాద్‌లో వార్షిక సైబర్‌ సెక్యూరిటీ నాలెడ్జ్‌ సమ్మిట్‌-2023 నిర్వహిస్తున్నారు. సైబర్ ట్రోలింగ్, వ్యాపార సముదాయాల్లో సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చిస్తామన్న హైదరాబాద్ సీపీ.. 40 నుండి 50 శాతం కేసులు సైబర్ క్రైమ్‌కు చెందినవే నమోదవుతున్నాయన్నారు. స్నాచింగ్ లాంటి నేరాలని ఏ విధంగా కట్టడి చేసామో... సైబర్ క్రైమ్‌ను కూడా అలా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్ళుగా లోన్ యాప్స్‌తో ఎంతోమంది మానసిక ఒత్తిడికి గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల్లో కూడా సైబర్ క్రైమ్‌పై చైతన్యం రావాలని.. అందుకే స్కూలు స్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story