TS: 10వ తరగతి పరీక్షల్లో సిద్దిపేట టాప్ రావాలి : మంత్రి హరీష్

TS: 10వ తరగతి పరీక్షల్లో సిద్దిపేట టాప్ రావాలి : మంత్రి హరీష్
మెరిట్ సాధించిన విద్యార్థులకు 10వేల రూపాయల నగదు బహుమతి అందిస్తామని మంత్రి తెలిపారు.

పదవ తరగతి ఫలితాల్లో సిద్ధిపేట జిల్లాను టాప్‌లో నిలిపేందుకు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. డీఈవో, ఏంఈఓలు, టీచర్లతో టెలీకాన్ఫారెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్.

10వ తరగతి ఫలితాల్లో సిద్ధిపేటను అగ్రగామిగా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్బంగా పదవ తరగతి విద్యార్థుల పేరెంట్స్ తో మాట్లాడిన హరీష్ రావు.. తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులను సెల్‌ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలన్నారు. మంచి మెరిట్ సాధించిన విద్యార్థులకు 10వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story