TS : 6ఏళ్ల క్రితం మహిళ కడుపులో ఆపరేషన్ కత్తి మర్చిపోయిన డాక్టర్లు

TS : 6ఏళ్ల క్రితం మహిళ కడుపులో ఆపరేషన్ కత్తి మర్చిపోయిన డాక్టర్లు
కుటుంబ సభ్యుల ఆదోళనతో వైద్యులు దిగొచ్చారు. బాధితురాలికి కొంత డబ్బు చెల్లించడంతో పాటు వైద్య ఖర్చులు భరిస్తామని ఒప్పందం చేసుకున్నారు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వైద్యుల నిర్వాకం బయటపడింది. ఆరేళ్ల క్రితం డెలివరి కోసం వెళ్లిన ఓ మహిళ కడుపులో కత్తి ఉంచి కుట్లు వేశారు వైద్యులు. అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతుంది. ఎంతకు తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్కానింగ్‌ రిపోర్టులో కడుపులో కత్తి ఉన్నట్లు తెలియడంతో ఆ మహిళ అవాక్కైయింది.


కుటుంబ సభ్యుల ఆదోళనతో వైద్యులు దిగొచ్చారు. బాధితురాలికి కొంత డబ్బు చెల్లించడంతో పాటు వైద్య ఖర్చులు భరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరి కోసం వచ్చిన మహిళ కడుపులో కత్తి మర్చిపోయిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వైద్యుల వల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story