TS : కేంద్రం ఇస్తుంటే కేసీఆర్ తీసుకోవడంలేదు : కిషన్ రెడ్డి

TS : కేంద్రం ఇస్తుంటే కేసీఆర్ తీసుకోవడంలేదు : కిషన్ రెడ్డి
యునివర్సిటీ, హస్పిటల్స్, ట్రైబల్ మ్యూజియంలను కేంద్రం ఇస్తామన్నా సీఎం కేసీఆర్ స్పందించలేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌.. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే తాము రాసిన లేఖలకు స్పందించాలన్నారు. ఉత్తరాలకు జవాబు ఇచ్చే సంస్కారం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. తెలంగాణలో రైల్వే లైన్ల నిర్మాణానికి భూసేకరణ జరగట్లేదని ఆరోపించారు. ట్రైబల్ యునివర్సిటీ డీపీఆర్ కోసం కేంద్రం కోటి రూపాయలు ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం కూడా కేటాయించలేదని అన్నారు.

జేబీఎస్, ఫలక్ నుమా మెట్రోకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1250 కోట్లను ఇచ్చిందని చెప్పారు కిషన్ రెడ్డి. ఫలక్ నుమా మెట్రో స్టేషన్ ను కావాలనే కేసీఆర్ సర్కార్ అడ్డుకుందని, ఎంఐఎం నేతల ఆస్తులు ఆ మెట్రో రూట్ లో ఉండటమే అందుకు కారణమని తెలిపారు. ట్రైబల్ మ్యూజియంకు కు ఇప్పటివరకు గజం జాగను కూడా కేసీఆర్ ఇవ్వలేదని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.శంషాబాద్, రామగుండం, బీహెఈఎల్ లో ఈఎస్ఐ హాస్పిటల్స్ ను నిర్మిస్తామని కేంద్రం చాలా సార్లు లేఖలు రాసిందని అందుకు ఒక్కసారైనా కేసీఆర్ సర్కార్ జవాబు ఇవ్వలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story