TS : మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : హరీష్ రావు

TS : మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : హరీష్ రావు
సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 5k రన్ నిర్వహించారు. రన్‌లో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 5k రన్ నిర్వహించారు. రన్‌లో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని హరీష్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి సహకరిస్తుందని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story