రాజకీయాల్లో ప్రణబ్‌ పాత్ర చిరస్మరణీయం : సీఎం కేసీఆర్

రాజకీయాల్లో ప్రణబ్‌ పాత్ర చిరస్మరణీయం : సీఎం కేసీఆర్
కరోనా నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి.. వైరస్‌ వ్యాప్తి..

కరోనా నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సభ్యులకు పలు సూచనలు చేశారు.. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. దేశం శిఖర సమానమైన నాయకుడ్ని కోల్పోయిందన్నారు.. రాజకీయాల్లో ప్రణబ్‌ పాత్ర చిరస్మరణీయమని సీఎం కేసీఆర్‌ సభకు తెలిపారు.

ఆ తర్వాత ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడారు.. ప్రణబ్‌ ముఖర్జీ దేశం గర్వించదగిన గొప్ప నాయకుడని.. ఆయన మరణించడం దేశానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ సమాజానికి ఆయన లేని లేటు పూడ్చలేదని అన్నారు. సభ్యుల ప్రసంగాల అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సభా ముఖంగా ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.. దేశానికి ప్రణబ్‌ చేసిన సేవలను సభ్యులకు వివరించారు.. ఆ తర్వాత ప్రణబ్‌ మృతికి సంతాప సూచికగా సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంతరం అకాల మరణం చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలిపింది.. సోలిపేట మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌.. తీవ్ర ఆవేదన చెందారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. నిత్యం ప్రజల మధ్య మనుగడ సాగించిన నిరాబండర నేతగా రామలింగారెడ్డిని కీర్తించారు సీఎం కేసీఆర్‌.

మంత్రి కేటీఆర్‌ కూడా రామలింగారెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.. ఎంతో చురుగ్గా, అందరినీ ఉత్తేజపరుస్తూ కనిపించిన రామలింగారెడ్డి ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కేటీఆర్‌ అన్నారు. సభ్యులందరూ మాట్లాడిన అనంతరం సంతాప తీర్మానం చదివి వినిపించారు స్పీకర్‌ పోచారం.. ఆ తర్వాత రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.. అనంతరం సభను స్పీకర్‌ మంగళవారానికి వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story