TSPSC: పేపర్‌ లీకేజీ రంగంలోకి ఈడీ

TSPSC: పేపర్‌ లీకేజీ రంగంలోకి ఈడీ
కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి స్టేట్‌మెంట్లు రికార్డ్‌ చేసేందుకు నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్‌

పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి స్టేట్‌మెంట్లు రికార్డ్‌ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్‌ వేశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను ముందుగానే అందుకొని పరీక్షలు రాశారన్న అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టనుంది. హవాలా రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఇప్పటికే ఈడీకి రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే మనీ లాండరింగ్‌ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. సిట్‌ సాక్షిగా పేర్కొన్న శంకర్‌ లక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కస్ట్రోడియన్‌ శంకర్‌ లక్ష్మి కంప్యూటర్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయినట్లు అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. శంకర్‌లక్ష్మితో పాటు TSPSCకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. కోర్టు అనుమతితో ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించనుంది ఈడీ.

Tags

Read MoreRead Less
Next Story