TSPSC పేపర్‌ లీకేజీ కేసులో బయట పడుతున్న కొత్త లింకులు

TSPSC పేపర్‌ లీకేజీ కేసులో బయట పడుతున్న కొత్త లింకులు
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌ సిట్‌ పోలీసులు నిన్న మరో నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌ సిట్‌ పోలీసులు నిన్న మరో నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆది సాయిబాబా, మాడావత్‌ శివకుమార్‌, నాగార్జునసాగర్‌ నివాసి రమావత్‌ మహేశ్‌, ఖమ్మం జిల్లాకు చెందిన పొన్నం వరుణ్‌లు.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ వద్ద ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు. ఢాక్యానాయక్‌ ద్వారా ప్రవీణ్‌కు పరిచయమైన వీరు ఒక్కో ప్రశ్నపత్రం 10 లక్షల చొప్పున ప్రవీణ్‌తో బేరమాడారు. అడ్వాన్సుగా ఒక్కొక్కరు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు వరకు చెల్లించారు. ఫలితాలు వెల్లడయ్యాక మిగతా సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరితో సంబంధాలున్న మరో 10 మంది కోసం గాలిస్తున్నారు. వీరంతా అడ్డదారిలో ప్రభుత్వ కొలువు సంపాదించేందుకు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు.

Tags

Read MoreRead Less
Next Story