TSPSC Group 1 Notification: తెలంగాణ గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల

TSPSC Group 1 Notification: తెలంగాణ గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల
పోస్ట్ లు, వయో పరిమితి పెంపు

తెలంగాణలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీచేసింది. అంతకుముందు 2022 ఏప్రిల్ 26 న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దుచేసింది.

2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన ట్సప్స్సీ ప్రిలిమ్స్‌ నిర్వహించింది. పేపర్ లీకేజీ కారణంగాఆ పరీక్షను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించింది. కానీ పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థుల కోర్టుకు వెళ్లగా రెండోసారి పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో TSPSC అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఇటీవలె సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. అ విజ్ఞప్తి మేరకు అప్పీలును వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో గ్రూప్‌-1 పాత నోటిఫికేషన్‌ను రద్దుచేస్తున్నట్టు TSPSC ప్రకటించింది. ఇటీవల కొత్తగా 60 పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని కూడా కలిపి మొత్తం 563పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. మే లేదా జూన్‌లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించనుంది. గత నోటిఫికేషన్‌ రద్దుచేసినందున అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ట్సప్స్సీ స్పష్టత ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసినా మ‌ళ్లీ చేయాల్సిందేనని తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని కమిషన్ ప్రకటించింది.

అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ.200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ.120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే.. కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అభ్యర్థులు పలు విషయాల్లో ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష ఫీజు మళ్లీ చెల్లించాలా? అనే సందేహం ఉంది. దీనిపై కూడా టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ క్లారిటీ ఇచ్చింది. పాత నోటిఫికేషన్‌లో అప్లయ్‌ చేసుకున్న వాళ్లు మళ్లీ అప్లయ్‌ చేసుకోవాల్సిందేనని.. అయితే.. గతంలో ఫీజు చెల్లించిన వాళ్లు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story