TSPSC Paper Leak: డీఈ పూల రమేష్ అరెస్టుతో కొత్త మలుపు

TSPSC Paper Leak: డీఈ పూల రమేష్ అరెస్టుతో కొత్త మలుపు
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. 37 మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. 37 మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్లు సమాచారం. పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు జైల్లోనే ఉన్నారు.

అనుబంధ అభియోగపత్రంలో మిగతా నిందితుల పేర్లను చేర్చే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నారు. మరోవైపు డీఈ పూల రమేష్ అరెస్టుతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కొందరు అభ్యర్థులతో హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించిన పూల రమేష్.. ఏఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు 80 మందికి విక్రయించినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story