TSRTC: టీఎస్‌ఆర్టీసీకి రికార్డుస్థాయి ఆదాయం

TSRTC: టీఎస్‌ఆర్టీసీకి రికార్డుస్థాయి ఆదాయం
ఒక్కరోజే ఆర్టీసీ 12 కోట్ల ఆదాయం..... 4 వేల 400 ప్రత్యేక బస్సుల ఆదాయం

సంక్రాంతి పండగ తెలంగాణ ఆర్టీసీకీ కాసుల వర్షం కురిపించింది. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి 12కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు అంచనా. ఈనెల 11, 12, 13వ తేదీల్లో 4వేల 400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ 3 రోజుల్లో కోటీ 50లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది. సుమారు 75లక్షలకు పైగా మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారనీ.. జీరో టికెట్లు 9 కోట్లు దాటిపోయినట్లు ఆర్టీసీ పేర్కొంది. సంక్రాంతి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అధికారులు రద్దీనీ మానిటరింగ్ చేసేందుకు కీలక పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. వాటిని బస్‌భవన్‌లో ఉన్న ఉన్నతాధికారులు పర్యవేక్షించి సూచనలు, సలహాలు అందించారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడంతోనే ఏ ఇబ్బందులు లేకుండా సంక్రాంతి పండుగను అధిగమించినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంటుంది.


సంక్రాంతి పండుగ సందర్బంగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణించినట్లు యాజమాన్యం వెల్లడించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మహాలక్ష్మి -మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మహిళలు భారీ సంఖ్యలో వినియోగించుకున్నట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్బంగా ఆర్టీసీ 6,261 ప్రత్యేక బస్సులను నడిపించింది. సంక్రాంతికి పండుగ మూడు రోజుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఈనెల 13వ తేదీన ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించింది. ఇందులో 1,127 హైదరాబాద్ సిటీ బస్సులను సైతం ప్రయాణికుల కోసం వినియోగించినట్లు అధికారులు తెలిపారు.


సంక్రాంతి పండుగ సందర్బంగా ఆర్టీసీ బస్సుల్లో కేవలం మూడు రోజుల్లోనే కోటీ 50లక్షలకు పైచిలుకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యమాజన్యం వెల్లడించింది. ఈ మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి - మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సుమారు 75లక్షలకు పైగా మహిళలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ అంచనావేస్తుంది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలు 9కోట్లు దాటిపోయినట్లు 10కోట్లకు చేరువైనట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న ఘణాంకాల ప్రకారం ఈ పథకాన్ని వినియోగించుకున్నవారు 10 కోట్లకు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈనెల 11వ తేదీన 28 లక్షల మంది, ఈనెల 12వ తేదీన సుమారు 28 లక్షల మంది, 13వ తేదీన సుమారు 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు ఆర్టీసీ ఘణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story