TSRTC: విపరీతంగా పెరిగిన టికెట్ ఛార్జీలు.. ఆర్‌టీసీకి ఏకంగా రూ.20-30 కోట్ల ఆదాయం..

TSRTC: విపరీతంగా పెరిగిన టికెట్ ఛార్జీలు.. ఆర్‌టీసీకి ఏకంగా రూ.20-30 కోట్ల ఆదాయం..
TSRTC: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఆర్టీసీ పాలకవర్గం సమావేశం జరిగింది.

TSRTC: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఆర్టీసీ పాలకవర్గం సమావేశం జరిగింది. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎండి సజ్జనార్‌తో పాటు ఏడుగురు పాలకమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో ముఖ్యంగా వార్షిక అకౌంట్స్‌, తార్నాకలోని ఆస్పత్రిని.. సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిగా మార్చడం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్‌ ఎండీకి, ఛైర్మన్‌కు వదిలేసేలా పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి ప్రయాణీకుడిపై ఒక్క రూపాయి సెస్‌, డీజిల్‌ సెస్‌తో కొంత, టోల్‌ ప్లాజా వద్ద సెస్‌తో ప్రయాణీకులతో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం వల్ల బోర్డు అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ టికెట్‌ ఛార్జీలు పెంచడం వల్ల 20-30 కోట్ల ఆదాయం సెస్ పై వస్తుందని సమావేశం తెలిపింది. ప్రమాదంలో చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో సుమారు 1200 మందికి కారుణ్య నియామకాలు చేపట్టడం.. లేదా.. వారిని ఆదుకోవడం వంటి అంశాలపై బోర్డు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు.

వారంలో వీటిపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నిర్ణయంతో సుమారు మూడు, నాలుగు వందల మందికి ఊరట కల్గుతుందని వారువెల్లడించారు. ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో కొత్త బస్సుల కొనుగోలు, కమర్షియల్ బిల్డింగ్, వాటిద్వారా ఆదాయం, కార్గోతో ప్రభుత్వ సంస్థల ద్వారా బివరేజ్‌, పీ.డీ.ఎస్ రైస్ వంటి వాటిద్వారా ఆదాయం వనరులు సమకూర్చుకోనే వాటిపైచర్చించింది.

దాదాపు వెయ్యి కొత్తబస్సులు కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు ఈసమావేశంలో చర్చకువచ్చింది. దూరప్రాంతాల వారికోసం ఏసీ,నాన్ ఏసీ, స్లీపర్ కోచ్‌ బస్సులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు సాధించిన ఫలితాలు, ఏడేళ్లలో జరిగిన నష్టంపై చైర్మన్ ప్రెజెంటేషన్ చేశారు. కోవిడ్ సమయంలో సిబ్బంది చేసిన సేవలను బోర్డు అభినందించింది.

Tags

Read MoreRead Less
Next Story