గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన TSRTC నాయకులు

గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన TSRTC నాయకులు
కార్మికులకు అన్యాయం జరగనివ్వనని గవర్నర్‌ చెప్పారు


ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు కార్మిక సంఘాల నేత థామస్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చల్లో పాల్గొన్న ఆయన గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు. సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ హమీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులను న్యాయం జరగాలని గవర్నర్ అన్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉందన్నారు.

మరోసారి గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్‌ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్‌ సమస్యలను ఆంధ్రప్రదేశ్‌ తీరుగానే పరిష్కరిస్తామని వెల్లడించింది.

ఇక తెలంగాణ కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుతం కొన‌సాగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాల‌ని కేసీఆర్‌ సర్కార్‌ సంక‌ల్పంతో ఉంది.. అయితే టెక్నికల్‌ గా మ‌నీ బిల్లు కావ‌డంతో గ‌వ‌ర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర స‌ర్కార్ పంపింది. అయితే బిల్లుపై గవర్నర్‌ పలు అభ్యంతరాలను వెలిబుచ్చారు. బిల్లు ఆమోదానికి తనకు కొంత సమయం కావాలని చెప్పారు.ఈ నేపథ్యంలో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story