TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! అలా అయితే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! అలా అయితే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
TSRTC: దూర ప్రయాణం చేసే వారిలో టీఎస్‌ఆర్‌టీసీలో బస్సులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

TSRTC: టీఎస్‌ఆర్‌టీసీ ఇప్పటికే ప్రయాణికులకు ఎన్నో విధాల సౌకార్యాలను అందిస్తూ వారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు పాటిస్తోంది. ప్రయాణికులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చిందని తెలిసినా.. అది పరిష్కరించడానికి ఆర్‌టీసీ ముందుంటుంది. అయితే తాజాగా సిటీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అంటూ భెల్‌ డిపో మేనేజర్‌ సత్యనారాయణ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

దూర ప్రయాణం చేసే వారిలో టీఎస్‌ఆర్‌టీసీలో బస్సులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే బస్సు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత దాని దగ్గరకు చేరుకోవడానికి ఏ సిటీ బస్సులో అయినా ఫ్రీగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. అది కూడా బస్సు రిజర్వేషన్‌కు రెండు గంటల ముందు నుండే ఈ ఫ్రీ ప్రయాణం చేయవచ్చని వారు అంటున్నారు.

అంతే కాకుండా దూర ప్రాంతాల నుండి సికింద్రాబాద్, హైదరాబాద్ చేరుకునే వారు కూడా వారి స్వస్థలానికి చేరుకోవడానికి సిటీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చని ఆర్‌టీసీ యాజమాన్యం వెల్లడించింది. అంటే దూర ప్రాంతాలకు వెళ్లడం కోసం టీఎస్‌ఆర్‌టీసీలో బస్సు బుక్ చేసుకున్న వారు.. వారు ఉన్న స్థలం నుండి ఆ బస్సు దగ్గరకు చేరుకోవడానికి కానీ, ఆ బస్సు నుండి తిరిగి ఇంటికి చేరుకోవడానికి కానీ.. సిటీ బస్సుల్లో ప్రయాణం ఫ్రీ అన్న వార్త ప్రయాణికులను ఖుషీ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story