రాష్ట్రంలో నియంత్రుత్వ పాలన : టీటీడీపీ నేత ఎల్.రమణ

రాష్ట్రంలో నియంత్రుత్వ పాలన : టీటీడీపీ నేత ఎల్.రమణ
మొక్క జొన్న రైతుల ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడ్డారు టీటీడీపీ నేత ఎల్.రమణ. ఈ ఏడాది భారీ వర్షాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం..

మొక్క జొన్న రైతుల ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడ్డారు టీటీడీపీ నేత ఎల్.రమణ. ఈ ఏడాది భారీ వర్షాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. నష్టపోయిన పంటల అంచనాలపై ప్రభుత్వం సర్వే చేయించలేదన్నారు. కేంద్ర బృందాన్ని వ్యవసాయ శాఖమంత్రి కలవలేదని.. తమకు కూడా కలవడానికి సమయం ఇవ్వలేదన్నారు. రైతుల ఆత్మహత్యల పంరంపర కొనసాగుతున్నా.. అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. రాష్ట్రంలో నియంత్రుత్వ పాలనపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story