హ్యాట్సాఫ్ : మానవత్వాన్ని చాటుకున్న కానిస్టేబుళ్లు.. !
విధి నిర్వహణే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వాన్ని కూడా చాటుతామని నిరూపిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

X
Vamshi Krishna21 Feb 2021 12:00 PM GMT
విధి నిర్వహణే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వాన్ని కూడా చాటుతామని నిరూపిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. సికింద్రాబాద్ తాడ్‌బండ్ దగ్గరున్న నాలాలో ఓ వ్యక్తి పడిపోయాడని 100 నంబర్‌కు ఫోన్ వచ్చింది. సమాచారం అందుకున్న కానిస్టేబుళ్లు.. వినయ్‌కుమార్, అహ్మద్ పాషా వెంటనే వెళ్లి నాలాలో పడిన వ్యక్తిని రక్షించారు. అతణ్ని ఉప్పల్‌కు చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు. అతనికి స్నానం చేయించి.. కొత్త బట్టలు అందించి అతని బంధువులకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుళ్ల ఔదార్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
Next Story