తెలంగాణ

Amit Shah : కేంద్రహోం మంత్రి అమిత్‌ షాకి ఘనస్వాగతం..!

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు...కమలం నేతలు ఘనస్వాగతం పలికారు.

Amit Shah :  కేంద్రహోం మంత్రి అమిత్‌ షాకి ఘనస్వాగతం..!
X

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు...కమలం నేతలు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు శాలువాతో స్వాగతం పలికారు. బీజేపీ సీనియర్‌ నేతలు మురళీధర్‌రావు, లక్ష్మణ్‌, ఇతర నేతలు అమిత్ షాకు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఈటలను అమిత్ షా ప్రత్యేకంగా పలకరింటం విశేషం.

అనంతరం అమిత్ షా రామంతాపుర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబొరేటరీని సందర్శించారు. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సెంట్రలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీని హోం మంత్రి ఆవిష్కరించారు. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ డివైఎస్‌ను పారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో హైదరాబాద్‌లో ల్యాబొరేటరీ కీలకపాత్ర పోషిస్తోంది. సెంట్రల్ డీటెక్టివ్ ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబొరేటరీ అంతా కలియతిరిగి వివరాలు తెలుసుకున్నారు. హోంమంత్రి అమిత్ షాతోపాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యక్రమంలోపాల్గొన్నారు.

అనంతరం శంషాబాద్‌ నొవాటెల్‌లో తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, టీఆర్‌ఎస్ దూకుడు వైఖరిపై అమిత్ షా..నేతలను అడిగితెలుసుకోనున్నారు. అనంతరం భవిష్యత్ పోరాటాలపై కీలక సూచనలు చేయనున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వొచ్చనే దానిపై ఈ సమావేశంలోనే స్పష్టత ఇవ్వనున్నారు అమిత్‌ షా. ఆ తర్వాత సాయంత్రం ఆరున్నగంటలకు తుక్కుగూడలోని బీజేపీ సభాస్థలికి వెళ్లనున్నారు. రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ ప్రజాసంగ్రమ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. తిరిగి రాత్రి 8 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢీల్లీ వెళ్లనున్నారు.

Next Story

RELATED STORIES