Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి  లేఖ
Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు..... కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఏడు పేజీల లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ లేఖలో పేర్కొన్నారు.

Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు..... కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఏడు పేజీల లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. గత ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9 రెట్లు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు.

ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులు, భూ కేటాయింపులు త్వరతగతిన ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 13 రైల్వే ప్రాజెక్టుల వివరాలను లేఖలో వివరించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు వంద కోట్ల నిధులతో పాటు 324 హెక్టార్ల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని.. అదే విధంగా అక్కన్న పేట - మెదక్‌ రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 31 కోట్లు, 1.02 హెక్టార్ల భూమి కేటాయించాలని లేఖలో కోరారు. ఎంఎంటీఎస్‌ ఫేస్‌ 2 నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్‌ వ్యయం 835 కోట్ల నుంచి 1150 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 630 కోట్లు ఇవ్వాలని లేఖలో కోరారు. భద్రాచలం -సత్తుపల్లి, కాజీపేట - బల్లహర్ష ప్రాజెక్ట్‌కు భూకేటాయింపులు చేయకపోవడం వల్లే ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి కరీంనగర్‌ ప్రాజెక్ట్‌ కోసం భూములు కేటాయించాలని 2018లో కోరితే.. గత ఏడాది కేటాయించారన్నారు

Tags

Read MoreRead Less
Next Story