Top

టీఆర్‌ఎస్‌ పాలనపై ఛార్జ్‌ షీట్‌ విడుదల చేసిన కేంద్ర మంత్రి

టీఆర్‌ఎస్‌ పాలనపై ఛార్జ్‌ షీట్‌ విడుదల చేసిన కేంద్ర మంత్రి
X

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ఆయన ఛార్జ్‌ షీట్‌ విడుదల చేశారు. ఒకే కుటుంబ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని... హైదరాబాద్‌ ను ఫ్లడ్‌ సిటీగా మార్చారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో డ్రేనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. డల్లాస్‌, ఇస్తాంబుల్‌ చేస్తామని హామీ ఇచ్చి.... ఫ్లడ్‌ సిటీగా మార్చారని విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో ఎలా గెలిచామో... హైదరాబాద్‌లోనూ ఆదేగాలితో గెలుస్తామన్నారు. MIM మేయర్‌ కావాలో... బీజేపీ మేయర్‌ కావాలో తేల్చుకోవాలని కేంద్ర మంత్రి జవదేకర్‌ అన్నారు.

Next Story

RELATED STORIES