Warangal: కొత్త కారుతో నేరుగా జైలుకి....

Warangal: కొత్త కారుతో నేరుగా జైలుకి....
కొత్త కారుకు పూజ చేయించాడు.... ఆరు మందికి మీదకి ఉరికించాడు..

శుభమానూ కొత్త కారు కొన్నాడు, పొద్దున్నే గుడికి తీసుకువచ్చి చక్కగా పూజ చేయించాడు. అన్నీ చక్కగా జరిగాయని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ, ఇన్ని చేసిన వాడు కార్ డ్రైవ్ చేయడమే నేర్చుకోలేకపోయాడు. దీంతో నిమ్మాకాయ మీదుగా నడిపించాల్సిన కారుని జనాల మీదకు ఉరికించాడు. ఇప్పుడు నేరుగా జైలుకు చేరుకుని ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని అన్నారందర్గా వద్ద చోటుచేసుకుంది.


వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన వ్యక్తి కొత్తకారుకు పూజ చేయించేందుకు అన్నారం షరీఫ్ దర్గా వద్దకు తీసుకువచ్చాడు. పూజ అనంతరం కారు నడిపిన వ్యక్తి, స్టీరింగ్ పై అదుపు కోల్పోవడంతో కారు పాదచారులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 6గురు గాయపడగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది.


ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సెక్షన్ 337కింద కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించారు.



Tags

Read MoreRead Less
Next Story