Hyderabad : జూపార్క్‌లోకి వరద నీరు.. సరూర్‌నగర్ స్టేడియంలో కుప్ప కూలిన ఫాల్‌సీలింగ్..

Hyderabad : జూపార్క్‌లోకి వరద నీరు.. సరూర్‌నగర్ స్టేడియంలో కుప్ప కూలిన ఫాల్‌సీలింగ్..
Hyderabad : హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.

Hyderabad : హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముంపు భయం వెంటాడుతోంది. సరూర్‌నగర్‌ ఇండోర్ స్టేడియంలో వర్షాలకు నానిపోవడంతో ఫాల్‌ సీలింగ్‌ పైకప్పు ఊడిపడడం ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. అదే సమయంలో అక్కడ నేషనల్‌ కబడ్డీ క్యాంప్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు.

హర్యానాలో సీనియర్‌ కబడ్డీ నేషనల్‌ ఛాంపియన్ షిప్ ఉండడంతో ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇదే టైమ్‌లో పైకప్పు ఊడిపడింది. ఐతే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.

అటు, నెహ్రూ జూపార్క్‌ వద్ద మీరాలం చెరువు పూర్తిగా నిండడంతో అలుగు పారుతోంది. దీంతో ఆ వరద నీరంతా జూలోకి వచ్చేస్తోంది. దీంతో సఫారీ ప్రాంతమంతా నీటమునిగింది. ఈ వరద పరిస్థితులతో అప్రమత్తమైన జూ అధికారులు సింహాలు, పులులు, జింకలను ఎన్‌క్లోజర్లలోకి తరలించారు.ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఈ వర్షాలు, వరద నేపథ్యంలో సఫారీని నిలిపివేశారు. హైదరాబాద్‌ తాగునీటికి ఆధారమైన జంట జలాశయాలు కూడా నిండుకుండల్లా మారి పూర్తిగా జలకళ సంతరించుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story