Singareni Elections: సింగరేణి కార్మికులపై హామీల జల్లు

Singareni Elections: సింగరేణి కార్మికులపై హామీల జల్లు
కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామన్న పొంగులేటి

ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనుండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. ఇక ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రతి కార్మికుడిని కలుస్తూ బాణం గుర్తుకు ఓటేసి టీబీజీకేఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. గత వారం నుంచి గనులు, వివిధ విభాగాల వద్ద జోరుగా ప్రచారం చేసిన నాయకులు ఆదివా రం కూడా కార్మికులు, ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సాధించిన హక్కులు, సౌకర్యాలను వివరిస్తూ ఓట్లు అడిగారు. ప్రధానంగా మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై టీబీజీకేఎస్‌ గని పిట్‌ కార్యదర్శి దాసరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కో నాయకుడు 50 మంది కార్మికులను కలువాలని ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రతి రోజూ మూడు షిప్టుల్లో కార్మికులను కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఏ రిలే, బీ రిలే, సీ రిలే కార్మికులతో కలిసి మాట్లాడుతున్నారు.

సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి దినోత్సవం రోజును సెలవుగా ప్రకటిస్తామని చెప్పారు. కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను చేపడతామని చెప్పారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరపున కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీలు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story