Weather Forecast: ఉన్నపాటుగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన..

Weather Forecast (tv5news.in)

Weather Forecast (tv5news.in)

Weather Forecast: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

Weather Forecast: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ వచ్చే 36 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీనికి తోడు కొమరిన్‌, శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలికాలం మొదలడంతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా.. ఆదిలాబాద్‌లో 15.2 డిగ్రీలు, మెదక్‌లో 16.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story