HanumaKonda: అత్తను కాల్చిచంపిన అల్లుడు

HanumaKonda: అత్తను కాల్చిచంపిన అల్లుడు
హనుమకొండలో తుపాకీ కాల్పుల కలకలం

మానవబంధాలను నోట్ల కట్టలు శాసిస్తున్నాయి. అనుబంధాలను ఆర్థిక లావాదేవీలు ఆవిరి చేస్తున్నాయి. మానవత్వాన్ని మంటగలుపుతూ... ఆస్తిపాస్తుల కోసం కొందరు నరరూప రాక్షసుల్లా మారేందుకైనా సిద్ధమవుతున్నారు. తాజాగా హనుమకొండలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవతో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌... అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. స్థానికుల ఆగ్రహానికి గురై, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

హనుమకొండ జిల్లాలోని గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలో తుపాకీ కాల్పులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. కాలనీలో నివాసముంటున్న కమలమ్మను... ఆమె అల్లుడు ప్రసాద్ తుపాకీతో కాల్చి చంపాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిన్న ప్రసాద్ఉ దయం అక్కడి నుంచి నేరుగా గుండ్లసింగారంలోని అత్త ఇంటికి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమె ఛాతిలో కాల్చాడు. తుపాకీ శబ్ధం విన్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకునేలోగా... కమలమ్మ ప్రాణాలు కోల్పోయింది. కోపోద్రిక్తులైన స్థానికులు... ప్రసాద్‌ను పట్టుకుని దాడి చేశారు. రాళ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.


నాలుగు లక్షల రూపాయల బాకీ విషయంలో అత్త, అల్లుడి మధ్య కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. రెండు కుటుంబాల మధ్య తరచూ వివాదంతో ప్రసాద్ భార్య రమాదేవి, కుమార్తె మధుమితతో పుట్టింట్లోనే ఉంటున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న అమ్మ... చూస్తుండగానే విగతజీవిగా పడిపోవటాన్ని చూసి... ఆమె కుమార్తె గుండెలు బాదుకుంది. హత్యోందంతం గురించి తెలుసుకున్న పోలీసులు... ఘటనాస్థలికి వచ్చి తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను ఆస్పత్రికి పంపారు. కమలమ్మ మృతదేహాన్ని MGMలో చేర్పించారు. వరంగల్‌ సెంట్రల్‌జన్‌ డీసీపీ బారీ నేతృత్వంలో హత్యోదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. MGMలో పోస్టుమార్టం అనంతరం... కమమలమ్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌కు చికిత్స అందిస్తున్నారు.

ఆయుధాలను సర్వీసింగ్‌ చేసే ఆర్మ్‌ క్లీనింగ్‌ టీమ్‌ బృందం బుధవారం కోటపల్లి పోలీ్‌సస్టేషన్‌కు వచ్చింది. అక్కడి ఆయుధగారంలోని ఆయుధాలను సర్వీసింగ్‌ చేసి వెళ్లింది. అదేరోజు వారెంటు బుక్‌ కోసం లోపలికి వెళ్లిన ప్రసాద్‌, అక్కణ్నుంచి ఎస్సై సర్వీసు రివాల్వర్‌ను దొంగిలించాడు. గురువారం ఉదయం నేరుగా హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉంటున్న అత్త కమలమ్మ ఇంటికి వెళ్లాడు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగిచ్చేయాలని కమలమ్మను ప్రసాద్‌ అడిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు.

Tags

Read MoreRead Less
Next Story