మాధవే మధుసూదన లోని "అలాంటి అందం" సాంగ్ లాంచ్ చేసిన నాగ చైతన్య

మాధవే మధుసూదన లోని అలాంటి అందం సాంగ్ లాంచ్ చేసిన నాగ చైతన్య
మాధవే మధుసూదన లోని "అలాంటి అందం" సాంగ్ లాంచ్ చేసిన నాగ చైతన్య

బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణంలో మాధవే మధుసూదన అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా పనులు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యువ సామ్రాట్‌ నాగచైతన్య ఈ చిత్రంలోని మొదటి పాటను ఆవిష్కరించాడు. అనంతరం నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమాలోని అలాంటి అందం సాంగ్ చాలా బాగుందన్నాడు. సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి నాగచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు వికాస్ బాడిస సంగీతం అందించగా వాసు సినిమాటోగ్రఫీ అందిచాడు.

Tags

Read MoreRead Less
Next Story