11 Years Of Simha : తొమ్మిది సంవత్సరాల అభిమానుల ఆకలి తీర్చిన సినిమా..!

11 Years Of Simha :  తొమ్మిది సంవత్సరాల అభిమానుల ఆకలి తీర్చిన సినిమా..!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించింది.

2001లో వచ్చిన నరసింహ నాయిడు సినిమా తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణకి సరైనా హిట్టు లేదు. ఇక సీనియర్ హీరోల పని అయిపోయినట్టేనని ఇండస్ట్రీలో టాక్.. బాలయ్య నుంచి వచ్చిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్టే ప్లాప్ అవుతుంది. అలా దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి.

ఆ తర్వాత సింహ సినిమాతో భారీ హిట్టు కొట్టాడు బాలయ్య. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించింది. 2010 ఏప్రిల్ 30న విడుదలైంది ఈ చిత్రం. అంటే సరిగ్గా నేటికి 11 సంవత్సరాలు అన్నమాట. 338 కేంద్రాలలో 50 రోజులు, 92 కేంద్రాలలో 100 రోజులు ఆడింది ఈ చిత్రం.

సుమారుగా 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 30 కోట్లకి పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా బాలయ్యకి నంది అవార్డు, ఉత్తమ హాస్యనటుడు క్యాటగిరిలో ఝాన్సీకి నంది అవార్డు, ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రికి నంది అవార్డు లభించింది.

ఈ సినిమాకి చక్రి సంగీతం అందించగా, చిన్నా నేపధ్య సంగీతం అందించారు. పరుచూరి కిరీటి సినిమాని నిర్మించారు.

Tags

Read MoreRead Less
Next Story