'అతడు'కి 16 ఏళ్ళు.. ఆ హీరోకి బ్లాంక్ చెక్ ఇచ్చిన మురళీమోహన్...!

అతడుకి 16 ఏళ్ళు.. ఆ హీరోకి బ్లాంక్ చెక్ ఇచ్చిన మురళీమోహన్...!
ఒక సినిమాని ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు.. కానీ ఓ సినిమాని లెక్కలేనన్ని సార్లు చూశారు.. అందులోనూ మళ్ళీ అది పదహారేళ్ళ కింద వచ్చిన సినిమా..

ఒక సినిమాని ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు.. కానీ ఓ సినిమాని లెక్కలేనన్ని సార్లు చూశారు.. అందులోనూ మళ్ళీ అది పదహారేళ్ళ కింద వచ్చిన సినిమా.. అంతగా ప్రేక్షకులకి ఆ సినిమా కనెక్ట్ అయింది. అదే మహేష్ బాబు 'అతడు' మూవీ.. అప్పటివరకు మహేష్ బాబు సినిమాలో అన్ని ఓ మూసధోరణిలోనే వెళ్తున్నాయి. కానీ మహేష్ ని చాలా కొత్తగా చూపించి ఫ్యాన్స్ కి బిగ్ సప్రైజ్ ఇచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ సినిమాకి నేటితో 16 ఏళ్ళు నిండాయి. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

* స్వయవరం, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు లాంటి సినిమాలతో టాప్ రైటర్ గా ఫేమస్ అయిన త్రివిక్రమ్ ముందుగా ఈ సినిమాతోనే డైరెక్టర్ కావాలని అనుకున్నారు. కానీ అప్పటికే స్రవంతి రవికిషోర్ బ్యానర్ లో ఓ సినిమాకి కమిట్ అవ్వడంతో త్రివిక్రమ్ రెండో సినిమాగా అతడు తెరకెక్కింది. మొదటి సినిమా నువ్వే నువ్వే..

* ఈ కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పారట త్రివిక్రమ్...కానీ ఈ కథ వింటూ పవన్ నిద్రపోయారట..ఆ తర్వాత ఇదే కథను మహేష్ కి చెప్పగా సింగిల్ సిట్టింగ్ లోనే మహేష్ కథను ఒకే చేశారట.. ఈ సినిమాని పద్మాలయ స్టూడియో పైన చేయాలనీ అనుకున్నారు మహేష్ ... కానీ తన రెండో సినిమాని త్రివిక్రమ్ జయభేరి ప్రొడక్షన్స్ అధినేత మురళీమోహన్ తో చేయాలనీ కమిట్ అవ్వడంతో ఆ బ్యానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కించారు.

* ముందుగా ఈ సినిమాలో నాజర్ పాత్రకి శోభన్ బాబు అనుకున్నారు మురళీమోహన్, త్రివిక్రమ్.. ఆయనని సంప్రదించారు కూడా.. అప్పటికే ప్రేక్షకుల దృష్టిలో అందగాడిగా గుర్తుండిపోయిన తాను.. ముసలి పాత్రలో నటించడం ఇష్టం లేకా ఈ సినిమాని ఒప్పుకోలేదు.. మురళీమోహన్ బ్లాంక్ చెక్ ఇచ్చినప్పటికీ రిజెక్ట్ చేశారు శోభన్ బాబు.. ఆ తర్వాత ఈ పాత్రను నాజర్ చేయగా.. ఆయనకీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు.

* అప్పటికే వర్షం సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న త్రిషను ఫిక్స్ చేశారు త్రివిక్రమ్.. అందులో ఆమె పేరు పూరీ.. త్రివిక్రమ్ ఇంటిపక్కన ఉండే అమ్మాయి పేరు పూర్ణిమ.. ఆమెను అందరు పూరీ అని పిలిచేవారట.. అది త్రివిక్రమ్ కి నచ్చడంతో హీరోయిన్ పాత్రకి ఆ పేరు పెట్టేశారు.

* ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం టైమ్-ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్లను వాడారు..యాక్షన్ సన్నివేశాలను పీటర్ హీన్స్ పర్యవేక్షణలో తెరకెక్కించారు.

* మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. ఎక్కువ డీవీడీలు అమ్ముడు పోయిన సినిమా కూడా ఇదే. ఉత్తమ డీవీడీ చిత్రంగా కూడా ఈ సినిమాకి అవార్డు కూడా వచ్చింది.

* మొత్తం 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు అడగా, ఒక్క హైదరాబాద్ లోని సుదర్శన్ 35 MMలో 175 రోజులు ఆడింది..

* ఈ సినిమా విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత మాటీవీ ఈ సినిమా శాటిలైట్ రేనివల్ కోసం ఏకంగా 3.5 కోట్లు చెల్లించింది. ఇది అప్పట్లో సెన్సేషన్ అని చెప్పాలి.

* ఈ సినిమాకి గాను ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు.

* ఈ సినిమా తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు.


Tags

Read MoreRead Less
Next Story