Actor Naresh: అలా చేస్తే థియేటర్లకు జనాలు వస్తారు: నరేశ్

Actor Naresh: అలా చేస్తే థియేటర్లకు జనాలు వస్తారు: నరేశ్
Actor Naresh: ‘థియేటర్లకు జనాలు ఎందుకు రావడం లేదు? సింపుల్.'

Actor Naresh: కోవిడ్ తర్వాత అన్నింటికంటే ముందుగా తెలుగు సినీ పరిశ్రమే వేగంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా హిట్స్, సూపర్ హిట్స్‌తో మిగతా భాషా పరిశ్రమలను వెనక్కి నెట్టింది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు పలు ఇతర భాషా పరిశ్రమలు కూడా తమ సినిమాలతో మంచి లాభాలనే వెనకేసుకుంటున్నాయి. అయితే విడుదలయిన ప్రతీ తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం కష్టమే. అందుకే కొన్ని పరాజయాన్ని కూడా చూస్తున్నాయి. ఇటీవల దీనిపై సీనియర్ నటుడు నరేశ్ ట్విటర్ ద్వారా స్పందించారు.

టికెట్ ధరల విషయంలో తెలుగు రాష్ట్రాలు కొన్నాళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమాంతం రేట్లను ఆకాశానికి ఎత్తేశాయి. దీంతో ఆ సమయంలో విడుదలయిన కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవ్వగలిగాయి. ఇది గమనించిన తర్వాత నిర్మాతలు కూడా మునుపటి టికెట్ ధరలనే ఖరారు చేస్తూ వస్తున్నారు. కానీ అంతో ఇంతో ఆ ప్రభావం ఇప్పటికీ ప్రేక్షకులపై ఉంది. ఇదే విషయాన్ని నరేశ్ ట్వీట్ చేశారు.

'థియేటర్లకు జనాలు ఎందుకు రావడం లేదు? సింపుల్. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి థియేటర్ అనుభవం కావాలంటే కనీసం రూ.2500 కావాలి. ఇది కేవలం టికెట్ ధరల వల్లే కాదు. రూ.20, 30కు దొరకాల్సిన పాప్‌కార్న్ కూడా రూ.300కు దొరుకుతుంది కాబట్టి. అందుకే జనాలకు మంచి సినిమాకంటే మంచి అనుభవం ముఖ్యం అనుకుంటున్నారు. ఆలోచించండి.'


'నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే.. ఒకప్పుడు యావరేజ్ సినిమా అయినా వారం రోజులు కలెక్షన్స్‌తో నిండిపోయేది. కానీ ఇప్పట్లో రెండో రోజు థియేటర్ నిండాలన్నా అది గొప్ప సినిమా అయ్యిండాలి. అలా అని ఎన్ని అద్భుతమైన సినిమాలు మనం చేయగలం. అందుకే థియేటర్లో ఖర్చులు తగ్గిస్తే జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.' అని తన ట్వీట్లతో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నరేశ్.


Tags

Read MoreRead Less
Next Story