ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్..

రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వచ్చిన వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్..
X

టాలీవుడ్ నటుడు రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వైద్యుల ప్రత్యేక శ్రద్దతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని భార్య జీవిత గత వారం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వచ్చిన వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో జీవిత వాటికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్ మీద చికిత్స అందించలేదని ఆ వార్తలు అవాస్తవమని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు. అనంతరం ప్లాస్మా థెరపీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం మెరుగు పడడంతో డిశ్చార్జ్ చేశారు. తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య బృందానికి జీవిత ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు రాజశేఖర్ కోలుకోవాలని చేసిన ప్రార్థనలు ఫలించాయని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES