రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత స్పందన..

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం..

రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత స్పందన..
X

సినీ నటుడు రాజశేఖర్ కుటుంబం కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడింది.. కుటుంబ సభ్యులంతా కోలుకున్నా రాజశేఖర్ మాత్రం ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయనకు చికిత్స చేస్తున్న సిటీ న్యూరో సెంటర్ నటుడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. చికిత్సకు స్పందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే విషయాన్ని రాజశేఖర్ భార్య పేర్కొంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వస్తున్నాయి. దయచేసి ఆ వదంతులను నమ్మొద్దు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.

దయచేసి అసత్య వార్తలను నమ్మవద్దు.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించండి అని అభిమానులను కోరారు. రాజశేఖర్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ విడుదల చేసిన ప్రకటనలో.. ఆయన ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ రత్న కిశోర్ తెలిపారు. సహ నటుడు, మిత్రుడు అయిన రాజశేఖర్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

Next Story

RELATED STORIES