ముగిసిన రవితేజ ఈడీ విచారణ.. కీలకంగా డ్రైవర్..!

ముగిసిన రవితేజ ఈడీ  విచారణ.. కీలకంగా డ్రైవర్..!
మనీ లాండరింగ్ వ్యవహారంలో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా రవితేజను ప్రశ్నించారు. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో విచారణ ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా రవితేజను ప్రశ్నించారు. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీల్యాండరింగ్‌కు సంబంధించిన విషయంలో దర్యాప్తు బృందం ఆరా తీసింది. మరోవైపు ఇదే కేసులో జిషాన్ కూడా ఈడీ ఎదుట హాజరు కాగా.. వారిద్దరినీ ఒకే రూంలో రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఉదయం 10 గంటల సమయంలో రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. 10 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభమైంది. రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 3 గంటల 45 నిమిషాల వరకూ రవితేజను ఈడీ అధికారులు విచారించారు. ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. రవితేజ ఖాతాలతో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్టుగా ఈడీ గుర్తించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల చుట్టూ.. విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.

ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. జిషాన్‌.. ఎఫ్‌ ప్రొడక్షన్స్ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడిపించాడు. ఈ నేపథ్యంలో ఈవెంట్లలో రవితేజ డ్రైవర్, సిబ్బందికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత రవితేజతో జిషాన్‌‌ డైరెక్ట్‌గా సంబంధాలు పెట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story