9 రోజుల్లో 7.5 కేజీలు.. ఎలా తగ్గానో చెబుతా: సునీల్

9 రోజుల్లో 7.5 కేజీలు.. ఎలా తగ్గానో చెబుతా: సునీల్
కరోనా టైంలో మూడు నెలలు బాగా తినేయడంతో మళ్లీ లావయిపోయాను

కామెడీ యాక్టర్ కాస్తా హీరోగా మారిపోయి.. వెయిట్ తగ్గితే మరిన్ని అవకాశాలొస్తాయని.. జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేసి స్లిమ్ అయ్యారు సునీల్. లాక్డౌన్‌లో షూటింగ్‌లు లేవు, జిమ్ లేదు.. తినడమే పనిగా ఉండేసరికి మళ్లీ లావయిపోయారు. దీంతో ఎలాగైనా తగ్గాలని భావించిన సునీల్ ప్రకృతి ఆశ్రమంలో జాయినయ్యారు. అనూహ్యంగా అక్కడ 9 రోజుల్లో 7.5 కేజీలు తగ్గారు.

ఆశ్రమంలో తానేం చేసిందీ వివరిస్తూ.. అందరూ నిండూ నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా.. 1996 నుంచి ప్రకృతి వైద్యం అనుసరిస్తున్నా. అయితే మధ్యలో వీలవ్వక మానేశాను. దాంతో మళ్లీ లావయిపోయాను.. ఆ విషయం మీక్కూడా తెలుసు. ఇక కరోనా టైంలో మూడు నెలలు బాగా తినేయడంతో మళ్లీ లావయిపోయాను. లావు తగ్గడానికి వ్యాయామం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో ప్రకృతి ఆశ్రమంలో చేరాను.

ఇక్కడ అన్నం తినకుండా ఎన్నిరోజులైనా ఉండొచ్చని నిరూపించారు. ముందు వెళ్లడానికి భయపడ్డా కానీ ధైర్యం చేసి ఇక్కడకు వచ్చాను. రెండు రోజులకు మించి నేను ఎప్పుడూ ఉపవాసం ఉండను. అలాంటిది ఏకంగా తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నాను. ఏమీ తినకుండా 9 రోజులు ఉపవాసం ఉండి కూడా మనిషి బతగ్గలడు అని అప్పుడు నాకనిపించింది.

ఇక్కడ తక్కువ కేలరీలు ఉన్న ఆహారం ఎంత కావాలంటే అంత పెడతారు. దాంతో మనం బరువు పెరుగుతామనే సమస్య ఉండదు. బాడీలోకి ఫ్యాట్ చేరదు.. పైగా దాని వల్లే ఎనర్జీ వస్తుంది. గంటకు ఒకసారి మంచినీళ్లు.. రెండు గంటలకు ఒకసారి మూడు స్పూన్ల తేనె ఒక నిమ్మ చెక్క. వీటితోనే 9 రోజులు ఏమీ తినకుండా ఉన్నాను. అసలు నీరసమే రాదు.

చేపలు, మాంసం వంటివి ఏమీ తినకపోయినా ఫుల్ ఎనర్జీతో ఉండేవాడిని. జిమ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివి చేసేవాడిని. ఒకవేళ బాడీకి ఎనర్జీ కావాలనిపిస్తే ముందే చెబుతుంది. అప్పుడు తేనె తీసుకుంటే సరిపోతుంది. అన్నీ తిని లావైన పరిస్థితీ నాకు తెలుసు.. ఏమీ తినకుండా ఉన్న పరిస్థితిని ఇప్పుడు చూశా. ఏ పని చేసినా సహజంగా చేస్తేనే బాగుంటుంది అని 'మంతెన' ఆశ్రమంలోని తన అనుభవాలను వివరించారు హీరో సునీల్.

Tags

Read MoreRead Less
Next Story