అవకాశాలు లేవు.. ఆటోలోనే నటుడు మృతి..!

అవకాశాలు లేవు.. ఆటోలోనే నటుడు మృతి..!
సిల్వర్ స్క్రీన్ పైన తమని తాము చూసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం కన్నవారిని, ఉన్న ఊరిని వదిలేసి నగరానికి వచ్చేసి స్టూడియోల చుట్టూ తిరుగుతూ.. నానా కష్టాలు పడుతుంటారు.

సిల్వర్ స్క్రీన్ పైన తమని తాము చూసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం కన్నవారిని, ఉన్న ఊరిని వదిలేసి నగరానికి వచ్చేసి స్టూడియోల చుట్టూ తిరుగుతూ.. నానా కష్టాలు పడుతుంటారు. అయితే ఇందులో కొందరికి అవకాశం వచ్చి నటులుగా స్థిరపడిపోతే.. మరికొందరు మాత్రం ఛాన్స్ లు లేకా.. రోడ్ల పక్కన, బస్టాండ్స్‌లో చాయ్‌, కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఇదిలావుండగా తాజాగా ఓ తమిళ నటుడు.. సినిమా అవకాశాలు రాక, రోడ్లుపైన ఉంటూ చివరకి ఓ ఆటోలోనే మృతిచెందాడు. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది.


విరుత్చకాకాంత్ బాబు అనే తమిళ నటుడు ఆటోలోనే మృతి చెందాడు. ఈ నటుడు భరత్ హీరోగా వచ్చిన ప్రేమిస్తే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దక్కలేదు. దీనికితోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో మానసికంగా మరింతగా కృంగిపోయాడు. రూమ్‌ కిరాయిలు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో.. రోడ్ల పక్కన, బస్టాండ్లల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. అయినప్పటికీ అవకాశాలు దొరకపోవడంతో చివరకు ఓ ఆటోలో నిద్రిస్తున్న సమయంలోనే మృతి చెందాడు.

Tags

Read MoreRead Less
Next Story