Vishal : అనాథ చిన్నారులతో పుట్టినరోజు వేడుకలు..!

Vishal : అనాథ చిన్నారులతో పుట్టినరోజు వేడుకలు..!
Vishal : హీరో విశాల్ నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Vishal : హీరో విశాల్ నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు వేడుకలను చెన్నైలోని కెల్లీస్‌లోని సురభి ఆశ్రమంలో అనాథ బాలల మధ్య జరుపుకున్నాడు. అక్కడ అనాధ పిల్లలకి స్వయంగా అన్నం తినిపించాడు. అక్కడ వారితో గడపడం మధురానుభూతిని కలిగించిందని ట్వీట్ చేశాడు. అంతకుముందు విశాల్ కీల్పాక్కంలోని మెర్సీ హోమ్‌లోని వృద్ధులకు అన్నదానం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విశాల్. ఇక తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు చీరలు, పంచెలు పంచి పెట్టారు అభిమానులు. పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనాథలను గుర్తించి అనాథాశ్రమాల్లో చేర్చారు.

Tags

Read MoreRead Less
Next Story