ఆ ముద్దు సన్నివేశంలో నటించడానికి కారణం ఇదే..!

స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే.. సినిమాల నుంచి తప్పుకొని పెళ్లి చేసుకున్నారు ఆమని.. వెండితెరకి చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆమె.. తాజాగా మళ్ళీ బిజీ అయిపోతుంది.

ఆ ముద్దు సన్నివేశంలో నటించడానికి కారణం ఇదే..!
X

శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం మొదలగు సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సీనియర్ నటి ఆమని.. ఫ్యామిలీ మూవీ హీరోయిన్ గా ఆమనికి ప్రేక్షకులలో మంచి పేరుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే.. సినిమాల నుంచి తప్పుకొని పెళ్లి చేసుకున్నారు ఆమని.. వెండితెరకి చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆమె.. తాజాగా మళ్ళీ బిజీ అయిపోతుంది. ఇటీవలే శర్వానంద్‌ హీరోగా వచ్చిన శ్రీకారం సినిమాలో నటించింది. ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.

కార్తీకేయ,లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ క్రమంలో ఓ యూట్యుబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమని.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు సినిమాలో సీనియర్ నటుడు నరేష్‌తో ఆమె చేసిన ఓ బోల్డ్ సీన్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో సన్నివేశం డిమాండ్‌ చేసినప్పుడు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదన్నారు.

వృత్తిలో భాగంగానే ఆ సన్నివేశాన్ని చేశానని చెప్పుకొచ్చారు. నరేష్ కూడా ధైర్యంగా సన్నివేశాన్ని చేయటానికి అంగీకరించి తన గౌరవాన్ని చాటుకున్నారని ఆమని వెల్లడించింది. కాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2014లో విడుదలైన చందమామ కథలు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.

Next Story

RELATED STORIES