అందుకే 'సౌందర్య' ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా: ఆమని

అందుకే సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా: ఆమని
అందం, అభినయం, మూర్తీభవించిన వ్యక్తిత్వం సౌందర్య సొంతం. తనకు పోటీగా ఎందరు తారలు వచ్చి ఎక్స్‌పోజింగ్ చేసినా తాను మాత్రం తనన నటననే నమ్ముకుంది.

నటీనటులను నాలుగు కాలాలపాటు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేలా చేసేది వారి నటనే కానీ ఎక్స్‌పోజింగ్ కాదని అభినేత్రి సౌందర్య ఆనాడే తన నటన ద్వారా చాటి చెప్పింది. అందం, అభినయం, మూర్తీభవించిన వ్యక్తిత్వం సౌందర్య సొంతం. తనకు పోటీగా ఎందరు తారలు వచ్చి ఎక్స్‌పోజింగ్ చేసినా తాను మాత్రం తనన నటననే నమ్ముకుంది.

భార్యగా, తల్లిగా, చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా ఏ పాత్రలో చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ నట విశ్వరూపాన్ని ప్రదర్శించేది. నాటి సావిత్రిని గుర్తుకు తెచ్చేది. కానీ దురదృష్టవశాత్తు 31 ఏళ్లకే కోట్లామంది అభిమానుల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

ఆమె దూరమై 17 ఏళ్లు అవుతున్నా సౌందర్య అనగానే గుర్తుకు వచ్చేది చిరునవ్వుతో కూడిన చక్కని సౌందర్య రూపం. పేరుకు తగ్గట్టే ఆమె సౌందర్యం అభిమానులకు చేరువ చేసింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి సరిజోడి అనిపించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందల చిత్రాల్లో నటించిన సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కు ఎందుకు దూరంగా ఉండేదో ఆమె స్నేహితురాలు, సీనియర్ నటి ఆమని వివరించింది.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా' లో ఆమని కీలక పాత్రలో నటించింది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమని సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం, ఆమె ఎక్స్‌పోజింగ్ ఎందుకు చేయలేదనే విషయాలను పంచుకుంది.

' ఓసారి షూటింగ్‌ గ్యాప్‌లో ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం.. అప్పుడు నేను సౌందర్యతో ఎక్స్‌పోజింగ్ గురించి అడిగాను.. దానికి ఆమె వెంటనే.. ఎందుకు ఎక్స్‌పోజ్ చేయాలి.. రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నప్పుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా వుంటుంది. మన ఫ్యామిలీకి ఎలా ఉంటుంది.

ఈ రోజు డబ్బు కోసం ఇలా చేస్తే రేపు ఎలా.. అని తిరిగి తననే ప్రశ్నించిందని ఆమని చెప్పుకొచ్చింది. ఒక నిర్ణయానికి కట్టుబడి సినిమాల్లోకి వచ్చింది.. అదే నియమాన్ని తన చివరి సినిమా వరకు అనుసరించింది అని చెప్పుకొచ్చింది ఆమని సౌందర్య గురించి. సౌందర్య లాంటి నటులు మళ్లీ మన తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తారో లేదో. ఏదేమైనా టాలీవుడ్ ఓ మంచి నటిని కోల్పోయింది. ఆమె జ్ఞాపకాలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Tags

Read MoreRead Less
Next Story