అందుకే చిరు, బాలయ్యతో చేయలేకపోయా : నటి గౌతమి

అందం, అభినయం కలిస్తే నటి గౌతమి అనడంలో ఎలాంటి సందేశం లేదు. తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.

అందుకే చిరు, బాలయ్యతో చేయలేకపోయా : నటి గౌతమి
X

అందం, అభినయం కలిస్తే నటి గౌతమి అనడంలో ఎలాంటి సందేశం లేదు. తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకులలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది గౌతమి. తాజాగా కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొని చాలా విషయాలను పంచుకున్నారమే.

అందులో భాగంగానే ద్రోహి చిత్రం గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నటుడు శుభలేఖ సుధాకర్ ఓ టెర్రరిస్టు పాత్రలో నటించారు. "సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగా ఆయన మా ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న అబ్బాయిపై కత్తి పెట్టి నన్ను బలవంతం చేస్తారు.. నిజంగా ఆ సన్నివేశంలో ఆయన లీనమై చేశారు. ఆ సన్నివేశం పూర్తి అవ్వగానే.. ఐయామ్‌ సో సారీ... ఐయామ్‌ సో సారీ.. అని చాలా సార్లు చెప్పారు" అని నటి గౌతమి చెప్పుకొచ్చారు.

ఇక హీరో చిరంజీవితో కలిసి నటించే అవకాశం ముచ్చటగా మూడుసార్లు వచ్చిందని కానీ.. డేట్స్ కుదరక మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలో కూడా అవకాశం వచ్చిందని అది కూడా డేట్స్ కుదరక మిస్ అయ్యానని గౌతమి చెప్పుకొచ్చారు. మనం ముందుగా డేట్స్ ఇచ్చిన సినిమాని పూర్తి చేయడం మన బాధ్యతని చెప్పుకోచ్చారమే.

Next Story

RELATED STORIES