Anandhi : తల్లి కాబోతున్న 'బస్‌‌స్టాప్' బ్యూటీ... !

Anandhi : తల్లి కాబోతున్న బస్‌‌స్టాప్ బ్యూటీ... !
బస్‌‌స్టాప్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్‌ ఆనంది తల్లి కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బస్‌‌స్టాప్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్‌ ఆనంది తల్లి కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి అని త్వరలోనే ఆమె కుటుంబం బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆనంది.. తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ ను ప్రేమించి ఈ ఏడాది జనవరి 7న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగమ్మాయిగా పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆనంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది. అనంతరం బస్ స్టాప్ సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. తాజాగా సుధీర్బాబు హీరోగా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story