'నిన్నే పెళ్లాడుతా' సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్...!

అక్కినేని నాగార్జున హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ 'నిన్నే పెళ్లాడుతా'..

నిన్నే పెళ్లాడుతా సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్...!
X

అక్కినేని నాగార్జున హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ 'నిన్నే పెళ్లాడుతా'.. 1996లో వచ్చిన ఈ సినిమాకి ఏకంగా జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత నాగార్జునకి లేడీ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాకి సిరివెన్నల అందించిన ఒక్కో పాట అణిముత్యమే. అయితే ఈ సినిమా గురించి ఇంకో ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ టబు కాదు.. మీనా.

అవును.. అప్పుడే ముత్తు సినిమా విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. అందులోని "థిల్లానా థిల్లానా" సాంగ్ అంద‌ర్నీ ఊపేస్తోంది. రజినీ స్టైల్, మీనా డాన్స్ కి అభిమానులు ఫిదా.. మీనాకి ఫుల్ క్రేజ్.. ఆ సమయంలోనే 'నిన్నే పెళ్లాడ‌తా'లో హీరోయిన్‌గా మీనాను ఊహించుకున్నారు కృష్ణవంశీ. ఆమెను కలిసి కథ కూడా చెప్పారు. అయితే సినిమాకి అరవై రోజుల కాల్షీట్లు అడిగారు కృష్ణవంశీ. అప్పుడు ఫుల్ బిజీలో ఉన్న మీనా అన్ని రోజులంటే క‌ష్టం ఇవ్వలేనంటూ సినిమా నుంచి తప్పుకుంది.ఈ విషయాన్ని మీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆ తర్వాత ముంబై వెళ్లి 60మందికి పైగా మోడల్స్ ని చూసిన కృష్ణవంశీ చివరకి టబుని ఫైనల్ చేశారు. కృష్ణవంశీ చెప్పిన రెండు నిమిషాల లైన్ కి టబు ఒకే చెప్పేశారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ చిత్రం 39 సెంటర్లలో 100 రోజులు, 4 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శింపబడింది. మొత్తం 12.3 కోట్ల షేర్లను రాబట్టింది.

Next Story

RELATED STORIES