పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన విశాల్..!

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఈ విషయాన్ని హీరో విశాల్ వెల్లడించాడు.

పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన విశాల్..!
X

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఈ విషయాన్ని హీరో విశాల్ వెల్లడించాడు. ఈ మేరకు విశాల్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 'ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్యత‌లు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్‌ ట్వీట్ చేశాడు. కాగా ఆర్య, సయేషా​ సైగల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 'గజినీకాంత్' అనే మూవీలో ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమాతోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. దీనితో పెద్దల అంగీకారంతో 2019లో మార్చ్ 10న పెళ్లి చేసుకున్నారు. కాగా సయేషా సైగల్ తెలుగులో అఖిల్ అనే సినిమాలో నటించింది.


Next Story

RELATED STORIES