టాలీవుడ్

బిగ్‌‌బాస్ లోకి ఎంట్రీ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి లీక్ చేసిన నటి..!

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్‌‌బాస్ సీజన్ 5 తెలుగు రెడీ అవుతుంది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో మరికొద్దిసేపట్లో మొదలుకానుంది.

బిగ్‌‌బాస్ లోకి ఎంట్రీ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి లీక్ చేసిన నటి..!
X

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్‌‌బాస్ సీజన్ 5 తెలుగు రెడీ అవుతుంది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో మరికొద్దిసేపట్లో మొదలుకానుంది. ఇప్పటికే షోలో అడుగుపెట్టేది వీరేనంటూ పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్టులో ఉమాదేవి పేరు కూడా ఉంది. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఉమాదేవి బిగ్‌‌బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి లీక్ చేసింది.

'ప్రతి అమ్మాయి ఏదో సాధించాలి అని చాలా కష్టపడుతుంది. ఎంతో ఇష్టంతో ఈ కెరీర్‌ను ఎంచుకున్నా. అప్పటినుంచి ఎన్నో మంచి సినిమాలు.. దాదాపు 100కు పైగా సినిమాలు చేశాను. ఇండస్ట్రీలో ఉన్న పాపులర్‌ కమెడియన్స్‌ అందరితో పనిచేశాను. 15కు పైగా సీరియళ్లలో ఎన్నో మంచి పాత్రలు పోషించాను. వాటిలో చంద్రిక, రజిని, భాగ్యం అనే పాత్రలకి ఎంత ఆదరణ చూపించారో మర్చిపోలేను. చాలా ఎంకరేజ్‌ చేశారు. ఇప్పుడు నేను నేనుగా ఏంటో తెలుసుకోవడానికి మీకు తెలియజేయడానికి మరో కొత్త అడుగును మీసాక్షిగా వేస్తున్నాను. ఇలాగే సపోర్ట్‌ చేయండి. ఇలాగే నా వెనుక ఉండి, నన్ను సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటూ, నేను ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి కష్టపడతాను. ఇది నా జీవితంలో వేస్తున్న 'బిగ్‌' స్టెప్‌. ఈ సర్‌ప్రైజ్‌ ఏంటో నేడే రివీల్‌ కానుంది' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టి బిగ్‌‌బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెప్పకనే చెప్పేసింది.


Next Story

RELATED STORIES