మేకప్ లేకుండా మెరిపిస్తున్న బ్యూటీలు..

గడియ గడియకు టచప్ చేసే మేకప్ మ్యాన్‌తో పనిలేకుండా హిట్లు కొడుతున్నారు

మేకప్ లేకుండా మెరిపిస్తున్న బ్యూటీలు..
X

హీరోయిన్లను మేకప్ లేకపోతే అసలు చూడలేం అనుకుంటాం కానీ.. మేకప్ లేకుండా నటిస్తున్నారు.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ఈ తరం తారలు. గడియ గడియకు టచప్ చేసే మేకప్ మ్యాన్‌తో పనిలేకుండా హిట్లు కొడుతున్నారు. తమలో ఉన్న నటిని వెలికితీస్తున్నారు. దర్శకులు తమకోసమే రాసిన పాత్రలకు న్యాయం చేకూరుస్తున్నారు. ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే కటౌట్‌తో పనేంటి అన్నట్టు.. పాత్ర బావుంటే గ్లామర్‌తో పనేంటి అని డీ గ్లామర్ పాత్రలకు ఓటు వేస్తున్నారు గ్లామర్ డాల్స్. సమంత, నయనతార, ఐశ్వర్య రాజేష్, తాప్సీ తదితరులు మేకప్ లేకుండా ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించారు. కీర్తి సురేష్, ప్రియమణి, రష్మిక తదితరులు కూడా ఇలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రామలక్ష్మిగా రంగస్థలంలో మెప్పించిన సమంత, మహానటిలో కూడా గ్లామర్ లేకుండా మంచి పాత్రని పోషించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకుంది. ఇక సామ్ తొలిసారి నటించిన వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మెన్ 2లో కూడా మేకప్ లేకుండా నటిస్తున్న ఆమె ఉగ్రవాదిగా కనిపించనుంది. గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ఓ మధ్యతరగతి అమ్మాయిగా లంగా ఓణీలో ఒదిగిన తీరు అద్భుతంగా ఉండనుంది.

కుమారి 21ఎఫ్‌తో అందర్నీ ఆకట్టుకున్న హెబ్బా పటేల్.. ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో పల్లెటూరిలో జీవించే ఓ పవర్ ఫుల్ మహిళగా నటించనుంది. ఇక అల్లు అర్జున్‌ 'ఫుష్స' చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన రష్మిక అందులోని పాత్ర కోసం మేకప్‌ని త్యాగం చేస్తోంది. చిత్తూరు యాస కూడా నేర్చుకుంటోంది.. తన పాత్రకు నూరు శాతం న్యాయం చేయడానికి రష్మిక కసరత్తు ప్రారంభించింది.

అదేవిధంగా వెంకటేష్ కథానాయకుడిగా వస్తున్న నారప్ప చిత్రంలో నటించేందుకు ప్రియమణి కూడా మేకప్‌కిట్‌ని పక్కన పెట్టింది. ఆర్‌ఎక్స్ 100తో తెలుగు ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్ అనగనగా ఓ అతిథి చిత్రంలో డీ గ్లామర్ పాత్రలో కనిపించి ఆహా అనిపించింది. ఇక ఇదే బాటలో మరో నటి అపర్ణ బాలమురళి ఆకాశమే నీ హద్దురా చిత్రంలో నటించి ఇటు తెలుగు ప్రేక్షకులను అటు తమిళ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇదే కోవలో ఐశర్యా రాజేష్, నయన తార, సంజన మేకప్ లేకుండా నటిస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.

Next Story

RELATED STORIES