అడవి శేష్‌కి దొరికిన పిల్లి.. దత్తత తీసుకుంటానంటున్నరేణూ దేశాయ్..

పోస్ట్ చూసిన రేణూ దేశాయ్ స్పందించారు.

అడవి శేష్‌కి దొరికిన పిల్లి.. దత్తత తీసుకుంటానంటున్నరేణూ దేశాయ్..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే ముందుగా గుర్తొచ్చేది అడవి శేష్. ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.. దాదాపుగా ప్రతి సినిమా హిట్టవుతుంది. ఇటీవల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అది చూసిన నెటిజన్స్ శేష్ ఔదార్యాన్ని మెచ్చుకుంటున్నారు.

రోడ్డు మీద ఒక పిల్లిని చూశానని ఇంటికి వెళ్లేటప్పుడు తనతో తీసుకువెళ్లానని చెప్పాడు. చలికి ఇబ్బంది పడుతున్న పిల్లిని చూస్తే తన మనసు చలించి పోయిందని అందుకే దాన్ని ఇంటికి తీసుకువచ్చానని పోస్ట్ చేశాడు. పోస్ట్ చూసిన రేణూ దేశాయ్ స్పందించారు. పిల్లిని కాపాడినందుకు శేషుకు ధన్యవాదాలు తెలిపారు రేణు. దానిని తాను దత్తత తీసుకుంటానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Next Story

RELATED STORIES