అక్కినేని నటనకి ప్రేక్షకులు కురిపించిన 'ప్రేమాభిషేకం'..!

అక్కినేని నటనకి ప్రేక్షకులు కురిపించిన ప్రేమాభిషేకం..!
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ హీరోహీరోయిన్లుగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం.. ‘ప్రేమాభిషేకం’.. ఈ సినిమా విడుదలై నేటికి (ఫిబ్రవరి 18) 40 యేళ్లు పూర్తి చేసుకుంది.

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ హీరోహీరోయిన్లుగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం.. 'ప్రేమాభిషేకం'.. ఈ సినిమా విడుదలై నేటికి (ఫిబ్రవరి 18) 40 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..!

దేవదాసు సినిమాలోని పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని దాసరి నారాయణ రావు ఈ కథను రాసుకోగా, అన్నపూర్ణ స్టూడియో పైన ఈ సినిమా తెరకెక్కింది. దాసరి, నాగేశ్వరరావు కలయికలో వచ్చిన ఆరో చిత్రం కావడం విశేషం.. ఇది అక్కినేనికి 194వ చిత్రం కావడం మరో విశేషం!

♦ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తెరకెక్కిన 3వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాను ఏఎన్నార్ కొడుకులైన అక్కినేని వెంకట్, నాగార్జున నిర్మాతలుగా వ్యవహరించారు.

♦ ఈ సినిమా అక్కినేని జన్మదినం అయిన సెప్టెంబర్ 20న మొదలవ్వగా, పెళ్లి రోజైన ఫిబ్రవరి 18న విడుదలైంది. అందుకనే తొలి సీన్ ను శ్రీదేవికి బర్త్ డే విషెస్ చెబుతూ అక్కినేని బొకే ఇచ్చే సీన్ తీశారు. అందులో ఈ రోజు నా పుట్టినరోజు అని కూడా ఆయన నోట పలికించారు దాసరి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది.

♦ ఈ సినిమాని కేవలం దాసరి 32 రోజుల్లోనే పూర్తి చేసారు.

♦ ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందిచగా అన్నీ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. అయితే ఈ పాటలన్నింటినీ దాసరి నారాయణ రావు రాయడం మరో విశేషం.

♦ హిందీలో ఈ చిత్రాన్ని జితేంద్ర రీనా రాయ్, రేఖలతో 'ప్రేమ్ తపస్య' పేరుతో రీమేక్ చేయగా, తమిళంలో 'ప్రేమాభిషేకం' పేరుతో కమల్ హాసన్, శ్రీదేవి, శ్రీప్రియలతో రీమేక్ చేసారు.

♦ ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల పైన షేర్ వసూల్ చేసిన మొదటి చిత్రం కాగా, మొత్తం 4.5 కోట్ల షేర్ వచ్చింది. 1987లోవచ్చిన పసివాడి ప్రాణం సినిమా ఆ రికార్డును క్రాస్ చేసింది.

♦ డైరెక్టుగా 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇది. షిఫ్టింగ్స్ తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది.

♦ తెలుగు సినిమారంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే.

♦ 20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది. 8 కేంద్రాలలో సంవత్సరంపాటు ఆడిన ఏకైక చిత్రమిది.

♦ 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, 1979లో సమరసింహారెడ్డి సినిమా దాన్ని క్రాస్ చేసేవరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది.

♦ ఒకే థియేటర్ లో 10 లక్షలు వసూల్ చేయడమే కష్టమైన ఆ రోజుల్లో 10 కేంద్రాల్లో 10 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డ్ సొంతం చేసుకుంది.

♦ ఒకే థియేటర్ లో 15 లక్షలు, 20 లక్షలు వసూల్ చేసిన తొలి సినిమా చరిత్ర సృష్టించింది.

♦ బెంగుళూరు నగరంలోని 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక సెంటర్ లో 46 లక్షలు వసూల్ చేసి కర్ణాటక రాష్ట్ర రికార్డ్ క్రియేట్ చేసింది.

♦ ఈ చిత్రానికి గాను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.

♦ ఈ చిత్రానికి గాను జయసుధకు ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది.

♦ ఏయన్నార్ నటజీవితంలో తొలిసారి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా 'ప్రేమాభిషేకం' నిలచింది

Tags

Read MoreRead Less
Next Story