Allu Arjun : అంధుడిగా 'ఐకాన్‌' స్టార్‌..!

Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా అనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Allu Arjun : అంధుడిగా ఐకాన్‌ స్టార్‌..!
X

Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా అనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం, స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్‌ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'కనుబడుట లేదు' అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో అంధుడిగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు అల్లు అర్జున్.

Next Story

RELATED STORIES