కూతురి యాక్టింగ్‌ చూసి మురిసిపోయిన అల్లు అర్జున్‌ దంపతులు..!

కూతురి యాక్టింగ్‌ చూసి మురిసిపోయిన అల్లు అర్జున్‌ దంపతులు..!
క్రియేటివ్ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

క్రియేటివ్ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో 'శాకుంతలం' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో అల్లు అర్జున్-స్నేహ దంపతుల కుమార్తె అల్లు అర్హ కీ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే తమ ముద్దుల కూతురు అర్హ నటనను దగ్గరుండి చూసేందుకు షూటింగ్ సెట్ లోకి వచ్చారు. ఈ క్రమంలో అర్హ నటనని చూసి వారు తెగ మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సినిమాను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణాటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలావుండగా గతంలో గుణశేఖర్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గొనా గన్నారెడ్డి అనే పాత్రలో నటించాడు.


Tags

Read MoreRead Less
Next Story