Anasuya Bharadwaj : అనసూయకి నాగార్జున బంపర్ ఆఫర్.. !

Anasuya Bharadwaj : అనసూయకి నాగార్జున బంపర్ ఆఫర్.. !
జబర్దస్త్‌‌లో యాంకర్‌‌గా కొనసాగుతూనే మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటుంది అనసూయ.

జబర్దస్త్‌‌లో యాంకర్‌‌గా కొనసాగుతూనే మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటుంది అనసూయ... ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ రంగమ్మత్త.. ఇప్పుడు పుష్ప సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. అంతేకాకుండా చిరంజీవి చేయబోయే ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు టాక్. ఇదిలావుండగా సీనియర్ స్టార్ హీరో నాగార్జున అనసూయకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


నాగార్జున హీరోగా, కళ్యాణ్‌‌కృష్ణ కురసాల దర్శకత్వంలో 'బంగార్రాజు' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గానే మూవీ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలో అనసూయ ఓ కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు కళ్యాణ్‌‌కృష్ణ ఆమె కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేశారట. దీనికి అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా గతంలో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసింది అనసూయ.


అనసూయకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక 'బంగార్రాజు' సినిమా విషయానికి వస్తే.. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్‌గా వస్తుంది. ఇందులో నాగార్జునతో పాటుగా నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కూడా నటిస్తున్నారు. అనుబ్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో భారీ బడ్జెట్‌‌‌తో నిర్మిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story