ఇటలీలో అనసూయ.. హిందీ పాటకు స్లోమోషన్‌లో...!

జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ... యాంకర్ గా కొనసాగుతూనే వెండితెర పైన అవకాశాలు వచ్చినప్పుడు నటిగా ప్రూవ్ చేసుకుంటుంది.

ఇటలీలో అనసూయ..  హిందీ పాటకు స్లోమోషన్‌లో...!
X

అనసూయ భరద్వాజ్.. బహుశా ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండలేరేమో... జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ... యాంకర్ గా కొనసాగుతూనే వెండితెర పైన అవకాశాలు వచ్చినప్పుడు నటిగా ప్రూవ్ చేసుకుంటుంది. క్షణం, రంగస్థలం చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, కృష్ణవంశీ రంగ మార్తాండ, రవితేజ ఖిలాడి సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుంది.

ఇక సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ రంగమ్మత్త... తాజాగా సోషల్ మీడియాలో అనసూయ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనసూయ.. 'నీలి ఆస్మా' అనే పాపులర్ హిందీ పాటకు స్లోమోషన్‌లో నడుతూ వయ్యారాలు ఒలకబోసింది. ఖిలాడి సినిమా కోసం ఇటలీ వెళ్లిన అనసూయ.. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


Next Story

RELATED STORIES