Anasuya Bharadwaj : పుష్పలో అనసూయ పాత్ర అదేనా?

Anasuya Bharadwaj : పుష్పలో అనసూయ పాత్ర అదేనా?
ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆమె పాత్ర ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా నటిస్తున్నాడు. బన్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆమె పాత్ర ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ.. ఓ గిరిజన మహిళ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప కథను ఆమె పాత్ర మలుపు తిప్పుతుందని ప్రచారం నడుస్తుంది. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైన ఈ మూవీ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ‌రెండు భాగాలుగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట..!

Tags

Read MoreRead Less
Next Story